Home న్యూస్ కోలివుడ్ రికార్డులు బ్రేక్ చేసిన విజయ్ ఫ్యాన్స్….న్యూ రికార్డ్!

కోలివుడ్ రికార్డులు బ్రేక్ చేసిన విజయ్ ఫ్యాన్స్….న్యూ రికార్డ్!

1005
0

టాలీవుడ్ లో మొదలైన ట్విట్టర్ ట్రెండ్ రికార్డుల హోరు ఇప్పుడు కోలివుడ్ లో కూడా పీక్స్ లో కొనసాగుతుంది.. రీసెంట్ గా అక్కడ తల అజిత్ ఫ్యాన్స్ బర్త్ డే ట్రెండ్ లో సరికొత్త రికార్డులు నమోదు చేయగా ఆ రికార్డులు బ్రేక్ చేయడమే ధ్యేయంగా పెట్టుకున్న ఇలయ దళపతి విజయ్ ఫ్యాన్స్ ఇప్పుడు విజయ్ బర్త్ డే ట్రెండ్ లో పాత రికార్డులు బ్రేక్ చేస్తూ కొత్త రికార్డులు నమోదు చేశారు.

అజిత్ ఫ్యాన్స్ 24 గంటల్లో 8.43 మిలియన్ ట్వీట్స్ ని వేయగా ఆ రికార్డ్ ను బ్రేక్ చేసిన విజయ్ ఫ్యాన్స్ 24 గంటల్లో ఏకంగా 10 మిలియన్ మార్క్ ని దాటేసి కోలివుడ్ మొట్ట మొదటి 10 మిలియన్ ట్రెండ్ ని నమోదు చేశారు. ఫైనల్ కౌంట్ ఫ్యాన్స్ లెక్కల్లో 10.5 మిలియన్స్ కి అటూ ఇటూ గా ఉండటం విశేషం.

మొత్తం మీద కోలివుడ్ తరుపున కొత్త రికార్డులు కొట్టినప్పటికీ ఓవరాల్ గా సౌత్ అండ్ ఇండియా లో బిగ్గెస్ట్ బర్త్ డే ట్రెండ్ రికార్డుల విషయం లో మాత్రం కొంచం వెనుకబడే ఉన్నారు… మొత్తం మీద ఆల్ టైం టాప్ 3 బిగ్గెస్ట్ బర్త్ డే ట్రెండ్ ని సొంతం చేసుకున్నారు.

ఒకసారి ఇప్పటి వరకు జరిగిన బర్త్ డే ట్రెండ్స్ లో టాప్ ప్లేసులలో నిలిచిన ట్రెండ్స్ విషయానికి వస్తే…
👉#HappyBirthDayNTR- 21.5M
👉#HappyBirthdayPawanKalyan: 10.51M
👉#HBDTHALAPATHYVijay: 10.5M~*
👉#HBDDearestThalaAJITH- 8.43M
👉#HappyBirthdaySSMB- 8.3M
👉#HBDJanaSenaniPawankalyan: 7.4M
👉#HBDSuperstarMAHESH: 4.5M
👉#HappyBirthdayPrabhas: 4.2M
ఇవి ఇప్పటి వరకు జరిగిన బర్త్ డే ట్రెండ్స్ లో టాప్ ప్లేసులలో నిలిచిన ట్రెండ్స్.

టాలీవుడ్ తరపున 2 సినిమాలు ఇప్పటికీ టాప్ లో ఉండటం విశేషం. కోలివుడ్ తరపున ఈ లిస్టు లో 2 ట్రెండ్స్ ఉండగా ఓవరాల్ గా ఈ ట్రెండ్ లో మన హీరోల ట్రెండ్స్ 6 ఉండటం గమనార్హం అని చెప్పాలి. ఇక రానున్న టైం లో మరిన్ని ట్రెండ్స్ ఈ లిస్టులో చోటు దక్కించుకునే అవకాశం పుష్పలంగా ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here