Home న్యూస్ ఫస్ట్ KGF2 సెకెండ్ సర్కారు వారి పాట…రచ్చ చేశారుగా!

ఫస్ట్ KGF2 సెకెండ్ సర్కారు వారి పాట…రచ్చ చేశారుగా!

1525
0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట సినిమా టీసర్ బ్లాస్టర్ తో టాలీవుడ్ రికార్డులను అన్నీ ఓ రేంజ్ లో బ్రేక్ చేయాలనీ ఫుల్ ప్రిపేర్ గా ఉన్న టైం లో టీసర్ ఆన్ లైన్ లో లీక్ అవ్వడం తో పరిస్థితులు అన్నీ మారిపోయి టీసర్ ను సడెన్ గా రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది కూడా మిడ్ నైట్ లో….

సడెన్ గా రిలీజ్ చేయాల్సి రావడం తో సర్కారు వారి పాట టీసర్ బ్లాస్టర్ ఇక యూట్యూబ్ లో కొత్త రికార్డులను సృష్టిస్తుందా లేదా అన్న అనుమానాలు రేకేత్తగా మొదటి గంటల్లో చాలా స్లోగా స్టార్ట్ అయినా తర్వాత తర్వాత పుంజుకున్న సర్కారు వారి పాట టీసర్….

ఎండ్ టైం లో మరింత జోరు చూపి మొత్తం మీద టాలీవుడ్ రికార్డులను అన్నీ వ్యూస్ పరంగా బ్రేక్ చేసి సరికొత్త సంచలన రికార్డులను నమోదు చేసింది. ఇక ఈ క్రమంలో సౌత్ రికార్డుల విషయంలో కూడా దుమ్ము లేపిన ఈ టీసర్ ఇప్పుడు ఆల్ టైం టాప్ 2 ప్లేస్ ను సాధించింది.

సౌత్ మొత్తం మీద వచ్చిన టీసర్ లలో ఇండియా మోస్ట్ వాంటెడ్ మూవీస్ లో ముందు నిలిచిన KGF చాప్టర్ 2 టీసర్ మొదటి 24 గంటల్లో ఊహకందని విధంగా 68.83 మిలియన్స్ వ్యూస్ మార్క్ ని అందుకుని ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను కొట్టగా ఇప్పుడు రెండో ప్లేస్ లో సర్కారు వారి పాట 23.06 మిలియన్ వ్యూస్ తో టాప్ 2 ప్లేస్ ని సాధించింది.

ఇక మూడో ప్లేస్ లో అల్లు అర్జున్ పుష్ప ఇంట్రో టీసర్ 22.54 మిలియన్ వ్యూస్ తో టాప్ 3 కి చేరుకోగా 4 వ ప్లేస్ లో విజయ్ నటించిన మాస్టర్ టీసర్ 19.36 మిలియన్ వ్యూస్ తో నిలిచింది. ఓవరాల్ గా రికార్డ్ కొడుతుందా లేదా అన్న డౌట్ ఉన్న సర్కారు వారి పాట ఏకంగా సౌత్ టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here