T2B Live

Box office India - Tollywood - Bollywood - Box Office Reports

సాహో డే 3 కలెక్షన్స్….ఆ టాక్ ఏంటి 250 కోట్లు ఏంటి!!



     2019 వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ మూవీ సాహో బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి తొలి 2 రోజుల్లో 104 కోట్లకు పైగా షేర్ ని వరల్డ్ వైడ్ గా 186 కోట్లకు పైగా గ్రాస్ ని, నిర్మాతల లెక్కల్లో 205 కోట్ల గ్రాస్ ను వసూల్ చేయగా సినిమా ఇప్పుడు మూడో రోజు లో కూడా దుమ్ము లేపే కలెక్షన్స్ తో దూసుకు పోతుంది, రెండు తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ గానే హోల్డ్ చేసిన సినిమా…

ఆల్ మోస్ట్ రెండో రోజు లెవల్ లోనే కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోతుండగా ఓవరాల్ గా కొన్ని సెంటర్స్ లో కొంచం ఎక్కువ గ్రోత్ కనిపిస్తుండటంతో మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 10.5 కోట్ల నుండి 11 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు.

ఇక హిందీ లో కలెక్షన్స్ సాలిడ్ గా ఉన్నాయి. సినిమా 2 రోజుల్లోనే ఆల్ మోస్ట్ 50 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోగా మూడో రోజు కూడా 27 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోవచ్చట. దాంతో 3 రోజుల్లో 77 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ పక్కా అని చెప్పాలి. ఇక కర్ణాటక లో కూడా సినిమా 2 కోట్ల లోపు షేర్ ని అందుకోవచ్చట.

ఓవర్సీస్ లో సినిమా 2 మిలియన్ మార్క్ ని అందుకోగా మిగిలిన చోట్ల కూడా మంచి వసూళ్ళని సినిమా సాధిస్తుంది. కానీ తమిళ్ అండ్ మలయాళం వర్షన్స్ మాత్రం తీవ్రంగా నిరాశ పరిచాయి అని చెప్పాలి. మొత్తం మీద మూడో రోజు ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ మొత్తం అనుకున్న విధంగా ఉంటె…

28 కోట్ల నుండి 30 కోట్ల రేంజ్ లో షేర్ రావడం ఆల్ మోస్ట్ పక్కా, గ్రాస్ 50 కోట్ల నుండి 55 కోట్ల దాకా ఉంటుంది, దాంతో 3 రోజుల్లో సినిమా వరల్డ్ వైడ్ గా 240 కోట్ల నుండి 250 కోట్ల వరకు గ్రాస్ ని వసూల్ చేసే అవకాశం ఉంది, సినిమా కి మొదటి ఆటకి వచ్చిన టాక్ కి ఈ రేంజ్ ఊచకోత అంటే నిజంగా ప్రభాస్ రేంజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Related Articles

Post A Comment

avatar

SHARE THIS ARTICLE

Facebook
Twitter

SEARCH THIS SITE

SHARE THIS ARTICLE