Home న్యూస్ అక్షరాలా 670 కోట్లు ఔట్….8 రోజుల్లో పఠాన్ భీభత్సం!!

అక్షరాలా 670 కోట్లు ఔట్….8 రోజుల్లో పఠాన్ భీభత్సం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ బాద్ షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ పఠాన్ మూవీ ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకు పోతూ ఉండగా మొదటి వారంలో ఊహకందని వసూళ్ళని సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో వీక్ లో అడుగు పెట్టగా సినిమా ఊరమాస్ హోల్డ్ ని మరోసారి చూపించి దుమ్ము దుమారం లేపింది. సినిమా 8వ రోజు ఇండియాలో మొత్తం మీద…

18 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా సినిమా టోటల్ గా 8 రోజులలో ఇండియా లో మొత్తం మీద 344 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఇండియా టోటల్ 8 డేస్ గ్రాస్ లెక్క ఇప్పుడు మొత్తం మీద…

415 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సినిమా 8వ రోజు 75 లక్షల గ్రాస్ ను అందుకోగా టోటల్ గా 8 డేస్ గ్రాస్ 27.35 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక సినిమా టోటల్ ఓవర్సీస్ లో ఇప్పుడు 255 కోట్ల రేంజ్ లో…

గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా టోటల్ గా ఇప్పుడు సినిమా మొత్తం మీద 8 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 670 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. బాలీవుడ్ మూవీస్ లో ఆల్ టైం ఎపిక్ రికార్డులతో దూసుకు పోతున్న సినిమా ఈ వీకెండ్ లో మరోసారి ఊరమాస్ వసూళ్ళని అందుకునే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here