Home న్యూస్ కన్నడ గడ్డపై బాలయ్య పంజా….ఈ రేంజ్ బిజినెస్ ఏంటి సామి!

కన్నడ గడ్డపై బాలయ్య పంజా….ఈ రేంజ్ బిజినెస్ ఏంటి సామి!

2250
0

బాలకృష్ణ ఎవరితో సినిమాలు చేసినా కానీ బోయపాటి శ్రీను తో సినిమా అంటే క్రేజ్ మరో రేంజ్ లో ఉంటుంది, బాలయ్య ని ఆడియన్స్ ఎలా అయితే చూడాలి అనుకుంటారో అలానే చాలా వరకు మ్యాచ్ చేసే దర్శకుడిగా బోయపాటికి మంచి పేరుంది, బాలయ్య ఫ్లాఫ్స్ లో ఉన్న టైం లో సింహా లెజెండ్ లాంటి సినిమాలతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ లను బాలయ్యతో చేసి అల్టిమేట్ విజయాలను సొంతం చేసుకోగా….

తన యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్రజెన్స్ తో ఈ సినిమాలను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళింది బాలయ్య అనే చెప్పాలి. అలాంటి వీళ్ళ కాంబోలో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర మరి కొన్ని రోజుల్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉండగా…

సినిమా పై సాలిడ్ అంచనాలు ఉండగా సెకెండ్ వేవ్ తర్వాత బిగ్గెస్ట్ రిలీజ్ ను ఈ సినిమా సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు. కాగా బిజినెస్ కూడా జోరు అందుకోగా పక్క రాష్ట్రం కర్ణాటకలో సినిమా బిజినెస్ రీసెంట్ గా కంప్లీట్ అయ్యింది, సినిమా కి కర్ణాటకలో సెన్సేషనల్ బిజినెస్ జరిగింది..

ప్రస్తుతం ఉన్న టైం లో ఈ రేంజ్ బిజినెస్ ఏంటి అన్న ఆశ్యర్యాన్ని కలిగించేలా ఏకంగా 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను కర్ణాటక లో సొంతం చేసుకుంది అఖండ సినిమా. బాలయ్య బోయపాటి ల కాంబినేషన్ క్రేజ్ దృశ్యా ఈ రేంజ్ రేటు ఇవ్వడానికి అక్కడ డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావడం విశేషం… రీసెంట్ టైం లో ఈ రేంజ్ బిజినెస్ ఏ సినిమాకి కూడా అక్కడ…

సొంతం కాలేదు కానీ అఖండ కి ఇలాంటి బిజినెస్ జరగడంతో ఎంతవరకు ఈ బిజినెస్ ను సినిమా అక్కడ రికవరీ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారింది. సినిమా డిసెంబర్ 2న అక్కడ కూడా భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా కచ్చితంగా ఈ బిజినెస్ ను సినిమా అక్కడ రికవరీ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here