Home న్యూస్ అపజయం అంటే తెలియని డైరెక్టర్ తో బాలయ్య….మాస్ రాంపేజ్ ఖాయం అంట!

అపజయం అంటే తెలియని డైరెక్టర్ తో బాలయ్య….మాస్ రాంపేజ్ ఖాయం అంట!

2221
0

నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర అఖండ సినిమా తో సందడి చేయడానికి సిద్ధంగా ఉండగా ఈ సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడు. బాలయ్య బోయపాటి శ్రీను ల కాంబో కి క్రేజ్ సాలిడ్ గా ఉంటుంది కాబట్టి ఈ సినిమా కూడా అంచనాలను అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా ఈ సినిమా తర్వాత బాలయ్య అప్ కమింగ్ మూవీస్…

అన్నీ కూడా సాలిడ్ గానే ఉన్నాయని చెప్పాలి. ఈ సినిమా చేసిన వెంటనే క్రాక్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా చేయనున్న బాలయ్య ఆ తర్వాత అపజయం అంటే తెలియకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస పెట్టి బ్లాక్ బస్టర్ లను…

సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సరికొత్త సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత క్రిష్ తో ఒక సినిమా తర్వాత మరిన్ని సినిమాలు పైప్ లైన్ లో ఉండగా అనిల్ రావిపూడి లాంటి పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్స్ తీసే డైరక్టర్ తో..

బాలయ్య లాంటి మాస్ పవర్ ఉన్న హీరో సినిమా అంటే అంచనాలు ఓ రేంజ్ లో ఉండటం ఖాయం, రీసెంట్ గా పుట్టిన రోజు జరుపుకుంటున్న అనిల్ రావిపూడి బాలయ్యతో చేయబోతున్న సినిమా గురించి మాట్లాడుతూ ఇప్పటి వరకు చేసిన కథలు ఒకెత్తు బాలయ్యతో చేసే కథ ఒకెత్తు. కంప్లీట్ గా డిఫెరెంట్ టైప్ లో ఫ్యాన్స్ కోరుకునే మాస్ రాంపేజ్ తో..

సినిమా ఉంటుందని చెబుతున్నాడు అనిల్ రావిపూడి. ఈ మాటలతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగి పోతున్నాయని చెప్పాలి. వరుస హిట్స్ తో దూసుకు పోతున్న డైరెక్టర్ తో బాలయ్య మూవీ అంటే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ మరో లెవల్ లో ఉండటం ఖాయమనే చెప్పాలి. మరి ఆ రాంపేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో త్వరలో తేలనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here