Home న్యూస్ టాక్సీవాలా TRP రేటింగ్…విజయ్ కుమ్మాడు గా!

టాక్సీవాలా TRP రేటింగ్…విజయ్ కుమ్మాడు గా!

587
0

     విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ టాక్సీవాలా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వడనికన్నా ముందే ఆన్ లైన్ లో లీక్ అయిన విషయం తెలిసిందే. ఆ ఎఫెక్ట్ బాక్స్ ఆఫీస్ పై గట్టిగానే పడుతుంది అని అంతా భావించినా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్ళ తో సాలిడ్ విజయాన్ని అందుకుని నిర్మాతలకు బయ్యర్ల కి అద్బుతమైన ప్రాఫిట్స్ ని దక్కేలా చేసింది. ఇక ఈ సినిమా రీసెంట్ గా…

జీ తెలుగు లో టెలికాస్ట్ అవ్వగా తొలి టెలికాస్ట్ సమయం లోనే సినిమా మంచి TRP రేటింగ్ తో కుమ్మేసింది అని చెప్పాలి. సినిమా ముందే లీక్ అవ్వడం ఒరిజినల్ ప్రింట్ ఎప్పుడో రావడం లాంటివి జరిగినా కానీ టాక్సీ వాలా సినిమా కి TRP రేటింగ్ పరంగా…

11.8 TRP రేటింగ్ దక్కిందని సమాచారం. దాంతో లీక్ అయిన సినిమా అటు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇటు బుల్లితెర పై కూడా అద్బుతమైన స్పందన దక్కింది అని చెప్పాలి. ఇక విజయ్ దేవరకొండ అప్ కమింగ్ మూవీ డియర్ కామ్రేడ్ ఈ ఇయర్ సమ్మర్ కానుకగా రిలీజ్ కి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే.

ఇక ఆ సినిమా తో విజయ్ దేవరకొండ ఎలాంటి సక్సెస్ ని సొంతం చేసుకుంటాడో తెలియదు కానీ, సినిమా సినిమా కి తన రేంజ్ ని పెంచు కుంటూ స్టార్ హీరోల లీగ్ లో అడుగు పెట్టడానికి ఒక్కో అడుగు ముందుకేస్తూ దూసుకు పోతున్నాడు విజయ్ దేవర కొండ.

అప్ కమింగ్ మూవీ డియర్ కామ్రేడ్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మాణం అవుతుండటం తో ఆ మూవీ కూడా మంచి సక్సెస్ గా నిలిచే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. మరి విజయ్ దేవరకొండ ఆ సినిమా తో ఎలాంటి సక్సెస్ ని సొంతం చేసుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here