Home TRP రేటింగ్ ప్రభాస్ క్రేజ్ పవర్….లాస్ట్ వీక్ ఇండియా లో 2 సినిమాలతో రచ్చ!!

ప్రభాస్ క్రేజ్ పవర్….లాస్ట్ వీక్ ఇండియా లో 2 సినిమాలతో రచ్చ!!

392
0

 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి నేషనల్ వైడ్ క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే, బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్, తన పవర్ ఆ ఒక్క సినిమా తోనే అయిపోలేదని సాహో సినిమా తో నిరూపించాడు. ఆ సినిమా అయితే ఏకంగా ఫ్లాఫ్ టాక్ తో కూడా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ని హిందీ లో సాధించి అక్కడ 150 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుంది.

ఇక ప్రభాస్ హిందీ డబ్బింగ్ మూవీస్ కి యూట్యూబ్ లో సాలిడ్ క్రేజ్ ఏర్పడగా, సాహో బాహుబలి హిందీ సాంగ్స్ కి 100 మిలియన్స్ మినిమం సొంతం అవ్వడం మరింత విశేషం, దాంతో అక్కడ లోకల్ లెవల్ లోనే ప్రభాస్ కి సాలిడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ మొదలు అయ్యిందని కన్ఫాం అవ్వగా….

క్రమం తప్పకుండా తన సినిమా లు హిందీ లో డబ్ అవ్వడం వాటికి సాలిడ్ గా TRP రేటింగ్స్ దక్కడం మనం చూస్తూనే ఉన్నాం. లాస్ట్ వీక్ కూడా బాహుబలి 2 అండ్ సాహో సినిమాలు హిందీ డబ్బింగ్ వర్షన్స్ అక్కడ టెలికాస్ట్ అవ్వగా అన్ని హిందీ మూవీస్ లోకి…

అక్కడ లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన సినిమాల్లో ప్రభాస్ 2 సినిమాలు టాప్ 5 లో చోటు దక్కించుకోవడం విశేషం అనే చెప్పాలి. బాహుబలి 2 కి 70 లక్షల 80 వేల ఇంప్రెషన్స్ దక్కి టాప్ 2 ప్లేస్ ని సొంతం చేసుకోగా సాహో సినిమా కి 45 లక్షల ఇంప్రెషన్స్ ని సొంతం చేసుకుని టాప్ 5 ప్లేస్ ని లాస్ట్ వీక్ సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది.

ఇక ప్రభాస్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ అప్ డేట్ కోసం నేషనల్ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తుండగా అప్ డేట్ ఎప్పుడు వస్తుంది అన్నది క్లారిటీ లేకుండా పోయింది.. కమింగ్ సూన్ అని యూనిట్ నుండి న్యూస్ వస్తుంది కానీ డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయడం లేదు. సినిమా ఈ ఇయర్ లోనే అనుకున్నా ఇప్పుడు మాత్రం వచ్చే ఇయర్ సంక్రాంతి లేదా సమ్మర్ లో రిలీజ్ కాబోతుందని చెబుతున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here