Home న్యూస్ 45 కోట్ల ‘బింబిసార’ టీసర్ రివ్యూ….మినీ బాహుబలి….ఈ రేంజ్ ఎక్స్ పెర్ట్ చయలేదు!

45 కోట్ల ‘బింబిసార’ టీసర్ రివ్యూ….మినీ బాహుబలి….ఈ రేంజ్ ఎక్స్ పెర్ట్ చయలేదు!

2432
0

నందమూరి కళ్యాణ్ రామ్ కి ప్రయోగాలు ఏమి కొత్త కాదని చెప్పాలి. కెరీర్ లో ఎక్కువ భాగం సినిమాలు ప్రయోగాత్మకంగానే ఉండేలా ఎంచుకున్నా ఈ మధ్య కొన్ని రొటీన్ మూవీస్ చేయడం, అవి అంచనాలను అందుకోక పోవడంతో మార్కెట్ కొంచం డల్ అయింది అని చెప్పాలి. ఇలాంటి టైం లో ఏకంగా 45 కోట్ల రేంజ్ బడ్జెట్ లో అత్యంత భారీ ఎత్తున తనే నిర్మాత హీరోగా చేస్తున్న మైతలాజికల్ మూవీ బింబిసార….

టైం ట్రావెల్ మైతలాజికల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ తోనే మంచి అంచనాలను పెంచగా తర్వాత సినిమా గురించిన అప్ డేట్స్ ఏమి ఆడియన్స్ ముందుకు రాలేదు, కానీ ఇప్పుడు లేటెస్ట్ గా సినిమా అఫీషియల్ టీసర్ ను ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు…

టీసర్ చూస్తుంటే ఓ మినీ బాహుబలి ని గుర్తు చేస్తూ గ్రాండియర్ గా అల్టిమేట్ భారీ విజువల్స్ తో అదిరిపోయే సెట్టింగ్స్ తో విజువల్ వండర్ లా అనిపించగా “టైం ట్రావెల్ తో గాడ్ టు ఈవిల్” అంటూ వచ్చిన ఈ టీసర్ ప్రతీ షాట్ అబ్బుర పరిచింది అనే చెప్పాలి…

ఈ రేంజ్ క్వాలిటీ తో రావడం అంటే మామూలు విషయం కాదు, ఇక కళ్యాణ్ రామ్ లుక్స్ కానీ మ్యానరిజమ్స్ కానీ అదిరిపోగా విలనీష్ లుక్ అదిరిపోయింది, ఇక టీసర్ ఎండ్ లో ప్రజెంట్ టైం లో మరో కళ్యాణ్ రామ్ ని చూపెట్టడంతో ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ డ్యుయల్ రోల్ అని కన్ఫాం అయ్యింది. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉందని చెప్పాలి.

మొత్తం మీద టీసర్ అసలు ఎలాంటి అంచనాలు లేకుండా చూసిన ప్రతీ ఒక్కరినీ ఈ రేంజ్ లో ఇంప్రెస్ చేస్తుందని ఎక్స్ పెర్ట్ చేయలేదు అనే చెప్పాలి. ఇప్పటి వరకు సినిమా పై ఎలాంటి బజ్ ఉందో తెలియదు కానీ టీసర్ రిలీజ్ తర్వాత బజ్ ఓ రేంజ్ లో పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక 24 గంటల్లో టీసర్ కి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here