Home గాసిప్స్ గాడ్ ఫాధర్ లో ఈ హైలెట్ సీన్ ఉండదట…!

గాడ్ ఫాధర్ లో ఈ హైలెట్ సీన్ ఉండదట…!

626
0

మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ దగ్గర 10 ఏళ్ల తర్వాత సాలిడ్ కంబ్యాక్ ని సొంతం చేసుకుని తర్వాత వరుస కమిట్ మెంట్స్ తో దూసుకు పోతూ ఉండగా ఖైదీ నంబర్ 150, సైరా నరసింహా రెడ్డి లాంటి సినిమాల తర్వాత ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య సినిమా ఫిబ్రవరి 4 న రిలీజ్ కానుండగా ఈ సినిమా తర్వాత మెగాస్టార్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

అందులో ముందుగా మలయాళంలో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన మోహన్ లాల్ లూసిఫర్ సినిమా ను తెలుగు లో గాడ్ ఫాదర్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా తెలుగు రీమేక్ భాద్యతలను తీసుకోగా స్క్రిప్ట్ చేంజెస్ చాలా చేయగా ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ శాకిచ్చే న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది.

సినిమా ఒరిజినల్ వర్షన్ లో ప్రీ క్లైమాక్స్ టైం లో ఎవ్వరూ ఊహించని విధంగా హీరో పృద్వీరాజ్ స్పెషల్ క్యామియో ఉంటుంది అక్కడ, ఆ ఫైట్ సీన్స్ మోహన్ లాల్ ని హీరో ఎలివేట్ చేసే సీన్స్ అద్బుతంగా ఉండటంతో అవి అక్కడ ఓ రేంజ్ లో వర్కౌట్ అయ్యాయి. ఆ సీన్స్ ని తెలుగు లో ఏ హీరో నటిస్తారా అన్నది ఆసక్తిగా మారగా…

తెలుగు లో ఇప్పుడు ఆ సీన్స్ ని పెట్టడం లేదని అంటున్నారు. ఆ సీన్స్ లేకుండా కథ గాడ్ ఫాదర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో  ప్లాన్ చేసుకున్నారని, లూసిఫర్ లో ఉన్నట్లు స్పెషల్ క్యామియో ఇందులో ఉండబోదని గట్టిగానే వార్తలు వినిపిస్తుంది, కానీ అదే టైం లో మరో స్పెషల్ రోల్ లో సల్మాన్ ఖాన్ ఉంటారని అంటున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here