Home న్యూస్ బాక్ టు బాక్ డే 1 రికార్డులు…చరిత్ర సృష్టించిన షారుఖ్ ఖాన్!!

బాక్ టు బాక్ డే 1 రికార్డులు…చరిత్ర సృష్టించిన షారుఖ్ ఖాన్!!

0

9 ఏళ్ళు హిట్ కోసం ఎదురు చూసిన బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) ఈ ఇయర్ ఆల్ టైం ఎపిక్ కంబ్యాక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని కొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం… ఆ రికార్డులు చరిత్రలో నిలిచి పోయే రేంజ్ లో…

   

ఉండటం ఇప్పుడు అందరినీ ఆశ్యర్యపరుస్తుంది అని చెప్పాలి. హిందీ సినిమాల పరంగా ఓపెనింగ్ డే రికార్డుల విషయంలో ఈ ఇయర్ 2 సార్లు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రికార్డు ను సృష్టించాడు షారుఖ్ ఖాన్. ఈ ఇయర్ మొదట్లో పఠాన్(Pathaan) సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి…

బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే రికార్డ్ ను నమోదు చేశాడు…ఏకంగా 55 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఆ సినిమా రికార్డ్ సృష్టించగా ఇప్పుడు 8 నెలలు గడవక ముందే బాక్స్ ఆఫీస్ దగ్గర జవాన్(Jawan) మూవీ తో రచ్చ చేసిన షారుఖ్ ఖాన్…

ఈ సినిమాతో మొదటి రోజు ఆల్ టైం ఎపిక్ బెంచ్ మార్క్ ని సెట్ చేస్తూ ఏకంగా 65.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే రికార్డ్ ను సృష్టించాడు. దాంతో బాక్ టు బాక్ ఓపెనింగ్ డే రికార్డులను అందుకున్న హీరోగా…

రికార్డ్ ను నమోదు చేసిన షారుఖ్ ఒక్క ఏడాదిలోనే 2 సినిమాలతో ఇలాంటి రికార్డ్ ను సృష్టించి సంచలనం సృష్టించగా 9 ఏళ్ళుగా ఫ్లాఫ్స్ లో ఉండి ఇలాంటి కంబ్యాక్ ను ఇప్పుడు సొంతం చేసుకోవడం చరిత్ర కెక్కె విషయం అని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఏ రేంజ్ లో సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here