Home న్యూస్ ఆచార్య ‘సిద్దా’ టీసర్ రివ్యూ….అల్లకల్లోలం చేశారు…దండయాత్ర ఖాయం!!

ఆచార్య ‘సిద్దా’ టీసర్ రివ్యూ….అల్లకల్లోలం చేశారు…దండయాత్ర ఖాయం!!

0

మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ఆచార్య. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా వేవ్ ల ఎఫెక్ట్ వలన పోస్ట్ పోన్ అయ్యి వచ్చే ఇయర్ ఫిబ్రవరిలో 4 వ తేదీనా గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమాలో ఇప్పటికే చిరు టీసర్ ను రిలీజ్ చేయగా…

రెస్పాన్స్ అదిరిపోయే రేంజ్ లో వచ్చింది. తర్వాత నీలాంబరీ సాంగ్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా ఆ సాంగ్ కి కూడా రెస్పాన్స్ బాగా రాగా ఇప్పుడు లేటెస్ట్ గా సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపించబోతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించిన ఇంట్రో టీసర్ ను…

రిలీజ్ చేశారు మేకర్స్… ఈ టీసర్ చూస్తుంటే సినిమా పై ఉన్న అంచనాలు అన్నీ కూడా ఓ రేంజ్ లో పెరిగి పోయేలా ఉన్నాయి అని చెప్పాలి. ధర్మస్థలికి ఆపద వస్తే అమ్మోరు పూని అయినా ఆ ఆపద నుండి కాపాడుతామంటూ రామ్ చరణ్ చెప్పిన డైలాగ్స్ అదిరి పోయే విధంగా ఉండగా….

ఫస్ట్ ఫ్రేం నుండి చివరి ఫ్రేమ్ ముందు వరకు రామ్ చరణ్ లుక్స్ అదిరిపోగా పూజా హెడ్గే మరియు రామ్ చరణ్ ల పెయిర్ కూడా అదిరిపోయింది, ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ఆకట్టుకోగా సినిమా టీసర్ లో అన్ని షాట్స్ ఒకెత్తు లాస్ట్ లో పిల్ల చిరుత పులితో పెద్ద చిరుత పులి కోనేరుకి ఒకవైపు మరో వైపు…

మెగాస్టార్ తో మెగా పవర్ స్టార్ షాట్ అయితే నెక్స్ట్ లెవల్ లో అల్లకల్లోలం చేసేలా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా రామ్ చరణ్ సిద్దా సాగ టీసర్ అద్బుతంగా ఉండగా బాక్స్ ఆఫీస్ చిరు చరణ్ ల దండయాత్ర ఫిబ్రవరి నెలలో దుమ్ము లేపే రేంజ్ లో ఉండే ఛాన్స్ ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఈ టీసర్ 24 గంటల్లో ఓవరాల్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here