Home న్యూస్ కింగ్ ఖాన్ ఫ్యాన్స్ రికార్డ్…బాలీవుడ్ లో సరికొత్త రికార్డ్!

కింగ్ ఖాన్ ఫ్యాన్స్ రికార్డ్…బాలీవుడ్ లో సరికొత్త రికార్డ్!

1437
0

     బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కి రీసెంట్ టైం లో సరైన హిట్స్ అయితే లేవు, 2013 లో చెన్నై ఎక్స్ ప్రెస్ తో బాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన షారుఖ్ తర్వాత హ్యాప్పీ న్యూ ఇయర్ తో పర్వాలేదు అనిపించినా రీసెంట్ టైం లో జబ్ హ్యారీ మీట్ సేజల్ మరియు జీరో సినిమాలతో ఊహకందని డిసాస్టర్ మూవీస్ ని తన ఖాతాలో వేసుకుని ఫ్యాన్స్ ని భారీ గా నిరాశ పరిచాడు.

ముఖ్యంగా జీరో సినిమా పై ఎన్నో అంచనాలను పెట్టుకున్నా కానీ ఆ సినిమా అంచనాలను అందుకోలేక షారుఖ్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాఫ్ మూవీ గా నిలిచింది. ఇలాంటి సమయం లో సినిమాల నుండి కొంత గ్యాప్ తీసుకున్న షారుఖ్ ఇప్పటి వరకు కొత్త సినిమా ను మొదలు పెట్టలేదు.

ఈ క్రమం లో ఫ్యాన్స్ సోషల్ మీడియా షారుఖ్ సినిమా కోసం ఎదురు చూస్తూనే ఏదైనా అప్ డేట్ వస్తుందా అని ఆశగా ఉన్నారు, కానీ అలాంటి అప్ డేట్ ఏమి రాలేదు కానీ ఇంతలో షారుఖ్ పుట్టిన రోజు రీసెంట్ గా రావడం తో ఆ రోజును ఓ రేంజ్ లో సెలెబ్రేట్ చేసుకున్నారు అభిమానులు.

బాలీవుడ్ హీరోల పుట్టిన రోజు ట్రెండ్స్ ఏవి కూడా 3 లక్షల ట్వీట్స్ కూడా దాటలేదు, కానీ షారుఖ్ పుట్టిన రోజు ట్రెండ్ మాత్రం ఏకంగా 6 లక్షల 20 వేల మార్క్ ని అందుకుని బాలీవుడ్ హీరోలలో బిగ్గెస్ట్ బర్త్ డే ట్రెండ్ ని సొంతం చేసుకుంది. మన లా ఫ్యాన్స్ అక్కడ మరీ వీర లెవల్ లో ట్రెండ్ చేయరు.

ఉన్నంతలో ఇదే అక్కడ బిగ్గెస్ట్ బర్త్ డే ట్రెండ్ గా మారింది. ఇక షారుఖ్ ఎట్టకేలకు ప్రస్తుతం కథలు ఫైనల్ స్టేజ్ కి వచ్చాయని మరో 2 మూడు నెలలలో తన కొత్త సినిమాల అప్ డేట్ ఇస్తానని ఫ్యాన్స్ మీట్ లో చెప్పుకొచ్చారు. దాంతో ఫ్యాన్స్ ఆ అప్ డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here