Home న్యూస్ ABCD ప్రీమియర్ షో రివ్యూ..హిట్టా..ఫట్టా!!

ABCD ప్రీమియర్ షో రివ్యూ..హిట్టా..ఫట్టా!!

658
0

     అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ABCD, మలయాళ సూపర్ హిట్ ABCD కి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు భారీ ఎత్తున రిలీజ్ అవ్వగా ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలను పూర్తి చేసుకున్న సినిమా కి అక్కడ నుండి ఎలాంటి టాక్ లభించింది అన్నది ఆసక్తిగా మారింది. సినిమా స్టొరీ లైన్ ని ట్రైలర్ లోనే చెప్పేశారు. అమెరికాలో ఉండే రిచ్ కిడ్స్…

ఇండియా కి వచ్చి డబ్బులు లేకుండా ఎలా జీవితం కొనసాగించారు అన్నది కథ పాయింట్. కాగా ఈ పాయింట్ తో మొదటి అర్ధభాగం చాలా వరకు కామెడీ సీన్స్ తో ఆకట్టుకునేలా దర్శకుడు తెరకెక్కించాడని అంటున్నారు.సెకెండ్ ఆఫ్ కథ పాయింట్ మారుతుందని…

కొంచం సీరియస్ గా మారినప్పట్టికీ అక్కడక్కడా వచ్చే కామెడీ సీన్స్ ఆకట్టుకుంటాయని అంటున్నారు. ఓవరాల్ గా నటుడిగా అల్లు శిరీష్ మరింత మెరుగు అయ్యాడని అనిపిస్తుందని, భరత్ కూడా ఆకట్టుకోగా హీరోయిన్ రుస్కాన్ రోల్ చిన్నదే అయినా ఆకట్టుకుంటుంది అంటున్నారు.

ఇక వెన్నెల కిషోర్ రోల్ కామెడీ ని బాగా పండించి అని అంటున్నారు. ఓవరాల్ గా సినిమా కామెడి కోసం ఈజీ గా ఒకసారి చూసే విధంగా ఉందని, కథ అక్కడక్కడా బోర్ కొట్టినా కామెడి అలాగే ఒకటి రెండు పాటలు బాగుండటం తో సినిమా ను చివరి వరకు చూసే విధంగా అనిపిస్తుందని అంటున్నారు.

మొత్తం మీద ఓవర్సీస్ నుండి ABCD సినిమాను పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అన్న టాక్ ఫైనల్ గా బయటికి వచ్చింది అని చెప్పాలి. ఇక రెగ్యులర్ షోలకి సినిమా ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!