మూడో రోజు రెండో రోజు తో పోల్చితే డ్రాప్స్ కేవలం 15% కన్నా తక్కువ ఉండటం విశేషం అనే చెప్పాలి. ఓవరాల్ గా ఈవెనింగ్ అండ్ నైట్ షోల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని పక్కకు పెడితే సినిమా మరోసారి ఆన్ లైన్ బుకింగ్స్ ట్రెండ్ తో రెండు తెలుగు రాష్ట్రాలలో…
ఎంతలేదన్న 3.8 కోట్ల నుండి 4 కోట్ల రేంజ్ షేర్ ని అందుకోవడం ఖాయం, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటే ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పాలి, దాంతో తొలి వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే రేంజ్ లో ముగించబోతుంది మజిలీ సినిమా.
నాగ చైతన్య కెరీర్ లో రీసెంట్ టైం లో ఈ రేంజ్ లో హోల్డ్ చేసిన సినిమా మరోటి లేదు, రారండోయ్ వేడుక చూద్దాం కూడా బాగానే హోల్డ్ చేసినా అప్పటి తో పోల్చితే ఇప్పుడు మజిలీ ఆల్ మోస్ట్ డబుల్ రేంజ్ లో అన్ని చోట్లా హోల్డ్ చేసి స్టడీ కలెక్షన్స్ ని అందుకుంటుంది.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రీ రిలీజ్ బిజినెస్ లో చాలా మొత్తాన్ని వీకెండ్ కలెక్షన్స్ లోనే వెనక్కి తెచ్చింది అని చెప్పాలి. ఇక అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయి అన్నది ఆసక్తిగా మారింది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.